అమెరికా జర్నలిస్ట్‌లకు 12 ఏళ్ల కార్మిక శిక్ష

ఉత్తర కొరియాలోకి అక్రమంగా అడుగుపెట్టిన ఇద్దరు అమెరికా జర్నలిస్ట్‌లకు 12 ఏళ్ల కార్మిక శిక్ష విధించారు. ఈ ఏడాది మార్చి తరువాత ఈ ఇద్దరు జర్నలిస్ట్‌లు అక్రమంగా ఉత్తర కొరియాకు వచ్చారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న ఉత్తర కొరియా అధికారిక యంత్రాంగం వారికి 12 ఏళ్ల కఠిన కార్మిక శిక్ష విధించింది.

ఈ మేరకు సోమవారం అధికార కేసీఎన్ఏ వార్తా సంస్థ వివరాలు వెల్లడించింది. ఈనా లీ, లారా లింగ్ అమెరికా మీడియాకు చెందిన కరెంట్ టీవీతో పనిచేస్తున్నారు. ఉత్తర కొరియా, చైనా సరిహద్దుల్లో ఓ కథనం కోసం పనిచేస్తుండగా ఉత్తర కొరియా అధికారులు వారిని నిర్బంధించారు. వీరి విచారణ గత గురువారం ప్రారంభమైంది.

వెబ్దునియా పై చదవండి