అల్‌ఖైదా కొత్త అధిపతి జవహరి కోసం గాలింపు : యూఎస్

పాకిస్థాన్‌ గిరిజన ప్రాంతంలో దాగి ఉన్న తీవ్రవాద సంస్థ ఆల్‌ఖైదా నూతన అధిపతి ఆమన్‌ అల్‌ జవహరీని వేటాడాలని వాషింగ్టన్‌ నిర్ణయించినట్టు అమెరికా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల ఉన్నతాధికారి తెలిపారు. ఈజిప్టుకు చెందిన ఈయన ప్రస్తుతం అమెరికా ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అల్‌ఖైదా నాయకులందరూ దాక్కొని ఉన్నారని విశ్వసిస్తున్నట్టు అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బ్రెన్నన్‌ సిఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఒసామా మరణానంతరం జవహరీ ఆల్‌ఖైదా నాయకత్వాన్ని చేపట్టారని, వారందరినీ శిక్షించే వరకూ తాము విశ్రాంతి తీసుకోమని అన్నారు. సాధ్యమైనంత త్వరగా జవహరి విషయాన్ని తేల్చేందుకు నిత్యం పాకిస్థానీ తీవ్రవాద వ్యతిరేక భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన అన్నారు. ఆ సంస్థ తుడిచిపెట్టాల్సిందేనని, పని చేయాలని తమతో పాటు అనేక దేశాలు కంకణం కట్టుకున్నాయని చెప్పారు. యెమన్‌లో అల్‌ఖైదాపై కూడా అమెరికా దృష్టి పెట్టిందని వివరించారు.

వెబ్దునియా పై చదవండి