ఆప్ఘనిస్థాన్‌లో మంచు చరియలు విరిగి పడి 37 మంది మృతి

బుధవారం, 7 మార్చి 2012 (16:45 IST)
ఆప్ఘనిస్థాన్‌లో మంచుకొండలు విరిగి పడి 37 మంది దుర్మరణం పాలయ్యారు. చనిపోయిన వారిలో 12 మంది మృతదేహాలు మంచు చరియల కిందనే చిక్కుకుని ఉన్నారు. ఆప్ఘనిస్థాన్‌లోని బదహ్ షహానా అనే ప్రొవీన్స్‌లో గత కొన్ని రోజులుగా దట్టమైన మంచు కురుస్తోంది.

స్థానికంగా ఉండే కొండ ప్రాంతాల్లో భారీ మంచు చరియలు కూడా ఉన్నాయి. ఈ చరియల్లో కొన్ని ఆకస్మికంగా విరిగి పడ్డాయి. ఇందులో కొండ కింద నివశిస్తున్న గ్రామాల ప్రజలపై పడటం వల్ల 37 మంది చనిపోయినట్టు ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి అబ్దుల్ రౌవూఫిర్ షేక్ తెలిపారు.

ప్రస్తుతం గత దశాబ్దన్నర కాలంలో ఎన్నడూ లేని విధంగా మంచు కురుస్తోందని ఆయన తెలిపారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినట్టు తెలిపారు. కాగా, కొండ చరియలు విరిగి పడటంతో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారన్నారు.

వెబ్దునియా పై చదవండి