ఆఫ్ఘన్: అమెరికా ఎంబసీలో అశ్లీల కుంభకోణం

ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంలో అశ్లీల కుంభకోణం వెలుగుచూసింది. దీనికి సంబంధించి ఎనిమిది మంది భద్రతా సిబ్బందిపై అమెరికా దౌత్య యంత్రాంగం చర్యలు తీసుకుంది. నివాసం ఉంటున్న క్వార్టర్స్‌లో అనైతిక, లైంగిక దుష్ప్రవర్తన కనబరిచిన ఆరోపణలు రావడంతో ఈ ఎనిమిది మందిని విధుల నుంచి తొలగించారు.

ఇదిలా ఉంటే దౌత్యకార్యాలయానికి భద్రత కల్పిస్తున్న ప్రైవేట్ కాంట్రాక్టర్‌పై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా దౌత్య వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.

అర్మోర్ గ్రూపు నార్త్ అమెరికాకు చెందిన కాబూల్ సీనియర్ మేనేజ్‌మెంట్ టీం ఆఫ్ఘన్‌లోని అమెరికా దౌత్యకార్యాలయానికి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. కాబూల్ సీనియర్ మేనేజ్‌మెంట్ టీంను తక్షణమే మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.

వెబ్దునియా పై చదవండి