ఆస్ట్రేలియాలో 10-10-10 తేదీన రికార్డు స్థాయిలో వివాహాలు

ఆస్ట్రేలియాలో వందకు పైగా ప్రేమ జంటలు 2010వ సంవత్సరం 10వ నెలలో 10వ రోజున వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు గల కారణం ఇలాంటి తేదీ 100 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే రావడం. దీంతో చాలా మంది జంటలు తమ ప్రేమ ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పెట్టి ఒక ఇంటివాళ్లు కావడానికి రెడీగా ఉన్నారు.

ఆస్ట్రేలియాలో ఇది వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ.. 106 మంది జంటలు 10-10-2010 తేదీన రిజిస్టర్ కార్యాలయాలల ముందు వివాహాలు చేసుకోనున్నారు. సిడ్నీలో ఉన్న న్యూక్యాస్టల్, పారామటాలలోని జనన మరణాలు, పెళ్లిళ్లను రిజిస్టర్ చేసే కార్యాలయాలలో ఈ ఆదివారం వీరు తమ వివావాహాన్ని నమోదు చేసుకుంటారు.

"వందేళ్లలో ఒక్కసారి మాత్రమే ఇటువంటి ప్రత్యేక తేదీన పెళ్లి చేసుకునే అవకాశం జంటలకు వస్తుంది" అని ఎన్ఎస్‌డబ్ల్యూ అట్టోర్నీ జనరల్ జాన్ హట్జిస్టెర్గోస్ ఓ ప్రకటనలో తెలిపారు. 1856లో ఎన్ఎస్‌డబ్ల్యూ కార్యాలయాన్ని స్థాపించారు, ఇది వరకూ ఎన్నడూ లేనంతగా ఆదివారం ఈ కార్యాలయం రద్దీగా మారుతుందని ఆయన అన్నారు.

అక్కడి ప్రజలకు ఈ రోజు ఎంత ప్రాముఖ్యమైనదంటే.. గత సంవత్సరం నుంచే ఈ తేదీన వివాహం చేసుకోవడం కోసం బుకింగ్‌లు చేయటం ప్రారంభించారని ఆయన తెలిపారు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీ కొత్త ప్రారంభాలకు, స్వేచ్ఛకు, స్వంత భావాలకు ప్రతీక.

వెబ్దునియా పై చదవండి