ఇటలీలో భారీ భూకంపం : కూలిన ఎనిమిది వేల గృహాలు!

గురువారం, 31 మే 2012 (17:15 IST)
ఇటలీలో బుధవారం సంభవించిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16కు చేరుకుంది. అలాగే, ఈ భూకంపం ధాటికి దాదాపు ఎనిమిది వేల ఇల్లు కూలిపోయినట్టు స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇటాలీలోని బర్మా నగర్ సమీప ప్రాంతాన్ని భూకంప తీవ్రత కేంద్రంగా గుర్తించగా, ఇది రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఈ భూకంపంతో ఉత్తర ఇటలీ ప్రాంతమంతా కంపించింది. కేవస్సో, మిరంటోలా తదితర నగరాల్లో పెద్దపెద్ద భవనాలతో పాటు.. ఇల్లు కూలిపోయాయి. దీంతో ప్రాణభీతితో ప్రజలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య గురువారానికి 16కు చేరుకుంది.

భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, శిథిలాలు పడి గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ భూకంపంలో సుమారు ఎనిమిది వేల మంది తమ ఆవాసాలను కోల్పోయినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి