ఇరాక్‌ ఎన్నికలను వెంటనే ఆపండి..!: అల్‌ఖైదా హెచ్చరిక

ఇరాక్‌ పార్లమెంట్ ఎన్నికలు ఆదివారం జరుగనున్న నేపథ్యంలో, ప్రముఖ తీవ్రవాద సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇరాక్ పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోకూడదని అల్‌ఖైదా హెచ్చరించింది. అలాగాకుండా ప్రజలు ఓటువేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అల్‌ఖైదా హెచ్చరించింది.

ఇప్పటికే ఇరాక్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఇరాక్ ప్రపంచ దేశాల సహకారం కోరింది. ఈ నేపథ్యంలో ఇరాక్ ఎన్నికలను తక్షణమే ఆపివేయాలని అల్‌ఖైదా హెచ్చరించింది.

ఇదిలా ఉంటే.. అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు జరిగే రోజున ఇరాక్ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది. ఎన్నికలు జరిగే రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సైనిక కనుసన్నల్లో పోలింగ్ జరుగుతుంది. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే కర్ఫ్యూను విధించడమైందని ఇరాక్ ప్రభుత్వం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి