ఉగ్రవాద దాడులపై విచారణ చేపట్టిన ఎఫ్‌బీఐ

పాకిస్థాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్‌, రావల్పిండి సమీపంలోనూ ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులపై విదేశీ విచారణ సంస్థ ( ఎఫ్‌బీఐ ) బృందం విచారణ ప్రారంభించింది.

పాకిస్థాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్‌, రావల్పిండి సమీపంలోనూ ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులపై విదేశీ విచారణ సంస్థ ( ఎఫ్‌బీఐ ) బృందం విచారణ ప్రారంభించిందని పాకిస్థాన్ ఏఐజి ముహ్మద్‌ అస్లామ్‌ ఖాన్‌ తరీన్‌ పేర్కొన్నారు.

అక్కడ జరిగిన ఉగ్రవాద దాడుల్లో అమెరికా పౌరులు కొందరు మృత్యువాత పడగా, మరి కొందరు తీవ్రగాయాల పాలైనారు.

దీంతో ఎఫ్‌బీఐ బృందం రావల్పిండిలోని పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారంనాడు సందర్శించింది. అక్కడ దాడులకు సంబంధించి పోలీసులు సేకరించిన ఆధారాలను పరిశీలించింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఈ బృందం సద్దార్‌ బైరూనీ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి దాదాపు 90 నిమిషాల పాటు విచారణ చేసిందని ఆయన తెలిపారు.

ఎఫ్‌బీఐ విచారణాధికారులు పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్న సమయంలో లోపలికి ఎవరినీ అనుమతించ లేదు. అమెరికన్‌ ఎంబసీకి చెందిన పాకిస్తాన్‌ ఉద్యోగి ఈ బృందం వెంట ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి