ఐరాస సంస్కరణలకు వంద దేశాల మద్దతు: బ్రెజిల్

ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలి విస్తరణకు 100 దేశాలకు పైగా మద్దతిస్తున్నట్లు బ్రెజిల్, జపాన్‌ విదేశాంగ మంత్రులు స్పష్టం చేశారు. ఐరాసలో సంస్కరణల ప్రతిపాదన అనేక సంవత్సారాలుగా ఉందని దానికి పలు దేశాలు మద్దతు తెలుపుతున్నాయని బ్రెజిల్ విదేశాంగ మంత్రి ఆంటోనియో పత్రియోటా పేర్కొన్నారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జపాన్, బ్రెజిల్, జర్మనీ, భారత్‌లు సంయుక్తంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు మాత్రమే శాశ్వత సభ్య దేశాలు. మండలిలో సంస్కరణలకు సంబంధించి ఐరాసలో ఒప్పందం కుదిరినప్పటికీ 192 దేశాలు సభ్యులుగా ఉన్న సాధారణ అసెంబ్లీ ఈ ఒప్పందాన్ని అమలు చేయడంలో మూడు దశాబ్దాలుగా విఫలమవుతున్నది. పత్రియోటా, జపాన్ విదేశాంగ మంత్రి గురువారం బ్రెజిల్‌లో భేటీ అయ్యారు.

వెబ్దునియా పై చదవండి