కాబుల్ పేలుళ్ళు అతి క్రూరమైనవి: హమీద్ కర్జయీ

FILE
కాబుల్‌లో గురువారం ఉదయం జరిగిన పేలుళ్ళు అతి క్రూరమైనవని ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జయీ అన్నారు.

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్‌లోని భారతదేశపు దౌత్యకార్యాలయం వద్ద గురువారం ఉదయం జరిగిన పేలుళ్ళు అతి క్రూరమైనవని, ఇది తీవ్రవాదుల పిరికిపంద చర్యగా ఆ దేశాధ్యక్షుడు హమీద్ కర్జయీ అభివర్ణించారు.

అక్కడ జరిగిన దాడులు అమాయకపు ప్రజలను బలిగొనేదిగా వుందని, ఇది వారి చేతకాని తనానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ పేలుళ్ళ కారణంగా అమాయకులైన 12 మంది మృతి చెందగా దాదాపు 83 మంది తీవ్రగాయాల పాలైనారని ఆయన అన్నారు.

తమ సత్తాను చాటుకునేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, ఇందులో అమాయకులు బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు తాము సంతాపం ప్రకటిస్తున్నామని ఆయన శోకతప్త హృదయంతో అన్నారు. తీవ్రగాయాలపాలైనవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి