కాశ్మీర్ సమస్య పరిష్కరిస్తేనే శాంతి: జర్దారీ

కాశ్మీర్ సమస్య పరిష్కరిస్తేనే దక్షిణాసియా శాంతి, సుస్థిరతలు ఏర్పడగలవని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ స్పష్టం చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాల తప్పుడు ప్రణాళికలు.. వ్యూహాల కారణంగానే.. మత సంబంధమైన ఉగ్రవాదం అప్పట్లోనే పుట్టిందని ఆయన విమర్శించారు.

లండన్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ కేంద్రంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జర్దారీ మాట్లాడారు. అప్పట్లో పాక్‌లో నియంతృత్వ పాలన, ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాద నేతలకు పాక్‌ను స్వర్గధామంగా చేయడంలో పాశ్చాత్య దేశాలు మద్దతు పలకడం వంటి అంశాలు ఘోరతప్పిదాలుగా జర్దారీ అభివర్ణించారు.

పాక్ భూభాగాన్ని ఎట్టిపరిస్థితుల్లోను ఉగ్రవాద కార్యకలాపాలకు మాత్రం ఉపయోగపడనివ్వబోమన్నారు. అలాగే దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతలను సాధించేందుకు భారత్‌తో తిరిగి యథావిధిగా చర్చలు ప్రారంభం కావాలని.. కాశ్మీర్ సమస్యలు పరిష్కారం కావాలన్నారు.

వెబ్దునియా పై చదవండి