తాలిబన్ తీవ్రవాదులకు ఆప్ఘనిస్థాన్ అండ : పాకిస్థాన్

తాలిబన్ తీవ్రవాదులకు ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం అండదండలు అందిస్తోందని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆప్ఘన్, పాకిస్థాన్ రీజియన్‌లో ఉగ్రవాద మూలాలను ఏరివేసేందుకు తాము ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ ఆప్ఘన్ మాత్రం తీవ్రవాదులకు సాయం చేస్తోందని ఆరోపించింది.

పాకిస్థాన్ తాలిబాన్ కమ్యాండరైన ఫజుల్లా పాకిస్థాన్ భద్రత బలగాలకు వ్యతిరేఖంగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి దాడులు జరుపుతున్నారని పేర్కొంది. ఇదిలావుండగా ఫజుల్లా ఒకప్పటి పాకిస్థాన్ దళాలలో ఆఫీసర్‌గా స్వాట్‌ వ్యాలిలో పని చేసినట్టు తెలిపింది.

పాకిస్థాన్ ప్రభుత్వం ఎన్నోసార్లు బంధించమని చర్చలు కోరగా, ఆప్ఘన్ పాలకులు అందుకు నిరాకరించినట్టు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహామాన్ మాలిక్ ఆరోపించారు. ఇతే ఈ విషయాన్నీ ధృవీకరించే ఆధారాలు తమ దగ్గర లేకున్నా ఈ సమాచారం అత్యంత విశ్వసనీయమైనదని, ఆధారాలు దొరకగానే కఠిన చర్యలకు దిగుతామని రెహామాన్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి