తొలిసారిగా మంత్రిమండలిలో మహిళలు: నెజాద్

FILE
ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ తన మంత్రిమండలిలో తొలిసారిగా ముగ్గురు మహిళలను మంత్రిమండలిలో తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ఇరాన్ చరిత్రలోనే తొలిసారిగా మహిళలను మంత్రి మండిలిలోకి తీసుకోవడం ఇదే ప్రథమమని ఆయన అన్నారు.

నెజాద్ ఈ నెల ఐదవ తేదీన రెండవసారి పదవీ ప్రమాణస్వీకారం చేశారు. తొలుత జూన్ నెలలో అనేక వివాదాల మధ్య ఎన్నికలలో గెలిచిన తర్వాత పదవీ బాధ్యతలను తీసుకుని ప్రమాణ స్వీకారం చేశారు.

ఇరాన్ పార్లమెంట్ ఆగస్టు 21న 21మంది మంత్రి మండలిలో ప్రమాణస్వీకారం చేసేందుకు ఓటు హక్కును ఉపయోగించుకోనుంది. మంత్రిమండలిని పార్లమెంట్‌లో అనుమతి పొందించేలా చూడటం అక్కడి సాంప్రదాయమని అధికార వర్గాలు తెలిపాయి.

మహిళలకు మంత్రిమండలిలో చోటు కల్పించిన వారికి ఆరోగ్య, సమాజిక శ్రేయస్సు మరియు విద్యా శాఖలను కేటాయించినట్లు నెజాద్ చెప్పారు.

ఇదిలావుండగా ముస్లిం దేశంలో మహిళామణులకు మంత్రి మండలిలో స్థానం కల్పించడంపై అక్కడి మతఛాందసవాదులనుంచి నెజాద్‌కు విమర్శలు ఎదుర్కోక తప్పదంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు.

వెబ్దునియా పై చదవండి