నోబుల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న ఒబామా

గురువారం, 10 డిశెంబరు 2009 (20:03 IST)
ప్రపంచంలోనే అత్యంత అరుదైన శాంతి బహుమతి నోబుల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు గురువారం ఓస్లోలో అందుకున్నారు.

ఓస్లోలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో నోబుల్ శాంతి బహుమతిని ఒబామాకు శాంతిపురస్కార కమిటీ అందజేసింది. ఇందులో నోబుల్ శాంతి పురస్కారంతోపాటు రూ. 7 కోట్లు బహుమానంగా లభించింది.

ఒబామా అమెరికా అధ్యక్ష పదవి చేపట్టి ఇంకా ఏడాది కూడా పూర్తికాక మునుపే అతనికి ఈ పురస్కారం లభించడం గమనార్హం. ఒబామా తన పరిపాలనా కాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల కారణంగానే అతనిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కమిటీ వెల్లడించింది.

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన పురస్కారాన్ని అందుకున్న ఒబామా మాట్లాడుతూ... ప్రస్తుతం తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ఆయన అన్నారు. మా పోరాటం మానవతావాదానికి మాత్రమేనన్నారు.

ఇందులో ప్రజల ప్రాణాలను అంతం చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. తమ ఈ పోరాటంలో తమ దేశానికి చెందిన పలువురు సైనికుల ప్రాణాలను, వారి అత్యంత విలువైన సేవలను తాము కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ పురస్కారానికి తను అర్హుడను కాదని, మండేలా, మదర్‌ థెరిస్సాలాంటి వ్యక్తులు ఈ పురస్కారాన్ని అందుకోవడం, వారి కోవలోనే తనను సన్మానించడం తనకు చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి