పర్యాటకులను ఆకట్టుకోవడంలో మూడో స్థానంలో చైనా

గ్రేట్ వాల్ ఉన్న చైనా పర్యాటకులను ఆకట్టుకోవడంలో స్విట్జర్లాండ్‌ను వెనక్కినెట్టింది. ప్రపంచంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలపై ఐక్యరాజ్య సమితి తయారు చేసిన జాబితాలో చైనా మూడో స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ టూరిజమ్ ఆర్గనైజేషన్ తయారుచేసిన ఈ జాబితాలో చైనా స్పెయిన్‌ను అధికమించి మూడో స్థానంలో నిలిచింది.

78.95 మిలియన్ విదేశీ పర్యాటకులను ఆకర్షించి ఫ్రాన్స్ తొలి స్థానంలో నిలువగా 60.88 మిలియన్లతో అమెరికా రెండో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 55.66 మిలియన్ల విదేశీ పర్యాటకులు చైనాను సందర్శించారు. ఇది 2009 సంవత్సరం కంటే 9.4 శాతం ఎక్కువని చైనా పర్యాటక రంగ సమన్వయ విభాగ డైరక్టర్ మాన్ హాంగ్‌వోయి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి