పర్యాటక రంగం అభివృద్ధికి భారత్‌ వైపు భూటాన్ దృష్టి!

తమ దేశ అభివృద్ధిలో స్థిరంగా భారత్ మద్దతు స్వీకరిస్తున్న భూటాన్ ప్రస్తుతం తమ దేశ ఆర్థిక పురోగతికి పొరుగు దేశ పర్యాటకులను ఆకర్షించటానికి సన్నద్ధమవుతోంది. పొరుగున వున్న భారత్ మాకు మంచి మిత్ర దేశం, భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ మా దేశ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తూ వస్తుందని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల శాఖామంత్రి ఖాన్డూ వాంగ్ అన్నారు.

దీనిపై ప్రతి సంవత్సరం మా దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరింత మంది భారతీయులు తమ దేశంలో పర్యటించాలని కోరుకుంటున్నామన్నారు. 7 లక్షల కంటే తక్కువ జనాభా కలిగి ఉండే భూటాన్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పర్యాటకులకు ఆకర్షించటంలో 27 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి