పాకిస్థాన్‌కు భారీగా ఆర్థిక సాయం: యూఎస్

తీవ్రవాదులతో పోరాడుతున్న పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలకు భారీగా ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని 2009, 2010 ఆర్థిక సంవత్సరాల్లో అందజేస్తారు.

అయితే, రెండు బిలియన్ డాలర్లకు పైగా అమెరికా సాయాన్ని పాక్ అందుకుంటుందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. శనివారం జరిగిన 2010 సంవత్సరానికి గాను అంతర్జాతీయ వ్యవహారాల బడ్జెట్‌ కార్యక్రమంలో ఆ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.

దీనిపై స్టేట్ మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్స్ డిప్యూటీ సెక్రటరీ జాకబ్ లూ మాట్లాడుతూ.. 2010 ఆర్థిక సంవత్సరంలో ఒబామా ప్రభుత్వం పాకిస్థాన్‌కు 1.6 బిలియన్ డాలర్లు, ఆఫ్గనిస్థాన్‌కు 2.8 బిలియన్ డాలర్ల సాయం చేసేందుకు ప్రతిపాదించిందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి