పాకిస్థాన్‌లో తీవ్ర భూకంపం

పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలో శనివారం ఉదయం భూమి తీవ్రంగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదైందని వాతావరణ విభాగం తెలిపింది. భూమి కంపించడంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

పాకిస్థాన్‌లోని పేషావర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో శనివారం ఉదయం గం.10.17లకు భూమి తీవ్రంగా కంపించిందని వాతావరణ విభాగాధికారి తెలిపారు.

పేషావర్ నుంచి దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరం ఉత్తర భాగంలో 187 కిలోమీటర్ల భూతలంలో ప్రకంపనలు సంభవించాయని ఆ అధికారి తెలిపారు. ప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, కాని ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఆయన వివరించారు.

ఇదివరకు 2005 అక్టోబర్‌లో వచ్చిన భూకంపంలో దాదాపు 73 మంది మృత్యువాత పడ్డారని డెబ్భైవేలకుపైగా తీవ్రగాయాలపాలైనట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు 33 లక్షల మంది నిరాశ్రయులైనారని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి