ప్రధాని భారత పర్యటన విజయవంతం: నేపాల్

పలు కీలక ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా నేపాల్ ప్రధానమంత్రి మాధవ్ కుమార్ భారత పర్యటన విజయవంతమైందని ఆ దేశ ప్రభుత్వం ప్రభుత్వం పేర్కొంది. అధికార సంకీర్ణ ప్రభుత్వం తొలి వంద రోజుల పాలనలో సాధించిన అతిపెద్ద విజయం ఇదని నేపాల్ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి శంకర్ పొఖరెల్ తెలిపారు.

నేపాల్ ప్రధాని మాధవ్ కుమార్ భారత పర్యటన సందర్భంగా ఇరుదేశాలు పలు కీలక ఒప్పందాలపై సంతకం చేశాయి. నేపాల్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు, సహకారాన్ని విస్తరించేందుకు ఆయన తాజా పర్యటన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కొత్త వాణిజ్య ఒప్పందం వలన నేపాల్ ఎగుమతులు ఊపందుకుంటాయని చెప్పారు.

నేపాల్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పెంపుతోపాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారత్ మరింత సాయం అందజేయనుందని శంకర్ తెలిపారు. తాజా పర్యటన ద్వారా అంతేకాకుండా భారత పెట్టుబడిదారులకు దేశంలో అనుకూల వాతావరణం ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. మాధవ్ భారత పర్యటనను తొలి వంద రోజుల పాలనలో తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు.

వెబ్దునియా పై చదవండి