ప్రపంచపు అత్యంత శక్తివంతమైన మహిళగా మిచెల్లి ఒబామా

ప్రపంచపు "అత్యంత శక్తివంతమైన మహిళ"గా ఒబామా సతీమణి మిచెల్లి ఒబామా మొదటి స్థానాన్ని ఆక్రమించారు. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ నిర్వహించిన "ప్రపంచపు 100 మంది అత్యంత శక్తవంతమైన మహిళలు" జాబితాలో అమెరికా ప్రధమ పౌరురాలు (ఫస్ట్ లేడి) "మిచెల్లి ఒబామా" అగ్ర స్థానంలో నిలిచారు.

ప్రపంచంలోని 100 మంది మంది అత్యంత శక్తివంతమైన మహిళల పేర్లతో రూపొందించిన ఈ జాబితాలో భారత సంతతకి చెందిన పెప్సికో సంస్థ కొ-ఛీఫ్ ఇంద్రా నూయి, ఇంగ్లండ్ రాణి వంటి ప్రముఖులు పోటీపడగా రాజకీయ రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళగా 46 ఏళ్ల మిచెల్లి నంబర్ వన్ స్థానంలో నిలిచారు. కాగా.. మిచెల్లి తర్వాతి స్థానంలో క్రాఫ్ట్ ఫుడ్స్ సీఈఓ ఇరానె రోస్ ఫీల్డ్ ద్వితీయ స్థానంలో నిలువగా.. మీడియా దిగ్గజం ఓప్రా విన్‌ఫ్రే తృతీయ స్థానంలో నిలిచారు.

ఈ జాబితాలో ఇంద్రా నూయి 6వ స్థానలో నిలువగా.. వ్యాపార పరంగా రెండవ స్థానాన్ని ఆక్రమించారు. ఈ జాబితాలో ఈమెతో పాటు మరో ఇద్దరు భారతీయ మహిళలు యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మ (89వ స్థానం), ఐసిఐసిఐ బ్యాంక్ హెడ్ చందా కొచ్చార్ (92వ స్థానం)లు కూడా చోటు సంపాదించారు. రాజకీయాలు, వ్యాపారం, మీడియా, లైఫ్‌స్టైల్ వంటి విభాగాలతో ఫోర్బ్స్ ఈ జాబితాను తయారు చేసింది.

వెబ్దునియా పై చదవండి