ఫిలిప్పీన్స్‌లో భూకంపం: భారీ సంఖ్యలో మృతులు

ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని కార్డిలేరా ప్రాంతంలో మూడు చోట్ల భారీ వర్షాల తర్వాత భూమి కంపించింది. దీంతో అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 540కి చేరుకుంది.

ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని కార్డిలేరా ప్రాంతంలో మూడు చోట్ల భారీ వర్షాల తర్వాత భూమి కంపించింది. దీంతో అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 540కి చేరుకుందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతోపాటు భారీ వర్షాల తర్వాత లుజోన్ ప్రాంతంలో భూమి కంపించడంతో దాదాపు 181 మంది మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు.

బేంగ్వేత్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 120 మంది మృతి చెందినట్లు ఆ ప్రాంతపు గవర్నర్ నేస్టర్ ఫోంగవాన్ తెలిపారు.

తమ ప్రాంతంలో భూకంపం కారణంగా చాలా వరకు నష్టం వాటిల్లిందని, ముఖ్యంగా బేంగ్వేత్ ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లిందని, ఇక్కడ శవాలను వెలికి తీసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ప్రాంతీయ పౌర సురక్షా విభాగాధికారి ఓలివ్ లుసేస్ చెప్పారు.

అలాగే కొండప్రాంతంలో పర్యాటకులు పర్యటించే బేగ్యువా నగరంలో భూ కంపం కారణంగా పలు ఇండ్లు నేలమట్టమయ్యాయని, ఇక్కడ దాదాపు 25 మంది చనిపోయారని నగరపాలక అధ్యక్షుడు పీటర్ ఫియాంజా తెలిపారు.

దీంతోపాటు మౌంటెన్ ప్రోవిన్స్ ప్రాంతంలో 23 మంది మృత్యువాత పడ్డారని వీరిలో ఒకే ఇంట్లోని వారు దాదాపు 20మంది చనిపోయారని ఆ ప్రాంతపు ప్రాంతీయ గవర్నర్ మెక్సిమో దాలోగ్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి