బుకర్ ప్రైజ్ పురస్కారాన్ని పొందిన హిల్లరీ మెన్‌టెల్

ఆంగ్లసాహిత్యంలో ఉత్తమ నవలకు ఇచ్చే అరుదైన పురస్కారం బుకర్‌ప్రైజ్ 2009కిగాను బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి హిల్లరీ మెన్‌టెల్‌కు దక్కింది.

హిల్లరీ రచించిన "వూల్ఫ్ హాల్" పుస్తకానికి బుకర్‌ప్రైజ్‍‌ పురస్కారానికి ఎంపికైనట్లు వార్తా సంస్థ డీపీఏ తెలిపింది. బుకర్ మ్యాన్ ప్రైజ్ మనీ 50 వేల పౌండ్లను ఆమెకు అందజేశారు.

బహుమతిని అందుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం బుకర్ ప్రైజ్ పురస్కారం లభించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమె తన 37వయేట నుంచి రచనలు చేయడం ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం ఆమెకు 57 సంవత్సరాలు.

ఇదిలావుండగా మెన్‌టెల్ రచించిన ఈ పుస్తకానికి ఏఎస్ బియాంట్, జేఎమ్.కోయెట్జీ, ఆడమ్ ఫాల్డ్స్, సైమాన్ మావేర్, సారా వాటర్స్ రచించిన రచనలమధ్య బుకర్ ప్రైజ్‌కు ఎన్నుకోవడం జరిగింది. ఈమె ఇప్పటి వరకు 11 నవలలు రచించారు.

కాగా 1969లో ప్రారంభమైన ఈ బుకర్‌ప్రైజ్‍‌‌ను భారతదేశానికి చెందిన ప్రముఖ రచయితలు సల్మాన్ రష్దీ, అనితా దేశాయ్, అరుంధతీ దేశాయ్, అరవింద్ అడిగాలు గతంలో గెలుచుకున్నారు.

వెబ్దునియా పై చదవండి