బ్రిటన్‌తో తమ మైత్రి ఇలాగే కొనసాగుతుంది: ప్రతిభ

గురువారం, 29 అక్టోబరు 2009 (08:46 IST)
బ్రిటన్‌ దేశంలో అధికారిక ప్రర్యటన సందర్భంగా వచ్చిన భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బ్రిటన్ రాణితో సమావేశమైనప్పుడు భారత్-బ్రిటన్ దేశాల సంబంధాలు, మిత్రత్వం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ... భారత్- బ్రిటన్ దేశాలు రెండూ సంప్రదాయ బద్ధంగా ప్రజాస్వామ్యదేశాలేననీ, ఇరుదేశాలు సహజంగానే మిత్రదేశాలని భారత రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌ అన్నారు. తమ రెండు దేశాల సంబంధాలు, మిత్రత్వం ఇలాగే కొనసాగుతుందని ఆమె తన కోరికను వెలిబుచ్చారు.

ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడ్డాయని, ఈ మైత్రి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆమె అన్నారు. ఈ రెండు దేశ రాజధానుల్లో వివిధ మతాలకు చెందిన వ్యక్తులు, జాతులవారు కలిసి మెలిసి నివసిస్తున్నారన్నారు. ఇరు దేశాలు 21వ దశాబ్దంలో వచ్చే పలు సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవాల్సివుంటుందన్నారు.

వెబ్దునియా పై చదవండి