బ్రిటన్ యువరాజును కిడ్నాప్ చేస్తాం: అల్‌ఖైదా

బ్రిటన్ యువరాజు హ్యారీని కిడ్నాప్ చేస్తామని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా తాజాగా హెచ్చరించింది. శిక్షణ నిమిత్తం అపాచీ హెలికాఫ్టర్‌లో ఆప్ఘనిస్థాన్ వచ్చేందుకు సాహసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుదని అల్‌ఖైదా పేర్కొంది. ఈ మేరకు ఆసంస్థ నేతలు ఒక అరబిక్ వెబ్‌సైట్ ద్వారా పేర్కొన్నారు.

అయితే, ఈ హెలికాఫ్టర్‌లో పర్యటనకు వచ్చే ప్రిన్స్ హ్యారీని ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇది సాధ్యపడక పోతే అంతుచూస్తామన్నారు. అపాచీ హెలెకాప్టర్‌ను కూల్చివేసిన అనంతరం అతన్ని సజీవంగా బంధిస్తే మా లక్ష్యాల్లో ఒకటి నెరవేరినట్టేనని తీవ్రవాద నేతలు హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి