భారత్ అడుగు జాడల్లో ఆఫ్గనిస్థాన్: ముషారఫ్

పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదం రెచ్చిపోవడానికి ఐఎస్ఐ అండ ఉందని, దీంతోపాటు భారతదేశం అండ కూడా ఆఫ్గనిస్థాన్ దేశీయులకుందని, దీనికి సంబంధించి తమ వద్ద సాక్ష్యాలున్నాయని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సోమవారం వాషింగ్‌టన్‌లో చెప్పారు.

ఆఫ్గనిస్థాన్ దేశం భారతీయ గూఢచార సంస్థల అదుపులో ఉందని, దీనికి సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారాలున్నాయని, అలాగే పాక్‌లో ఉగ్రవాదం పెచ్చుమీరడానికి ఐఎస్ఐ హస్తం ఉందని దీనికి సంబంధించిన దస్తావేజులు తమ వద్దవున్నాయని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ అన్నారు.

ముషారఫ్ ఆదివారం ఓ ప్ర్రైవేట్ ఛానల్‌కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఆఫ్గనిస్థాన్ గూఢచార సంస్థ, ఆఫ్గన్ అధ్యక్షుడు, ఆ దేశ ప్రభుత్వం గురించి తనను అడగకండని ఆయన అన్నారు. ఆఫ్గన్ దేశం ఏం చేస్తోందో తనకు తెలుసునని, వారు ఓ ప్రణాళికాబద్ధంగా ప్రపంచాన్ని మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం ఆఫ్గన్ దేశం పాకిస్థాన్‌ను బూచిగా చూపిస్తోందని, ఎందుకంటే ఆ దేశంపై భారతదేశానికి చెందిన గూఢచార నిఘా సంస్థల ఆధ్వర్యంలో ఆ దేశ పరిపాలన కొనసాగుతోందని ఆయన అన్నారు.

తాలిబన్ అగ్రనేత ముల్లా ఉమర్ పాకిస్థాన్ దేశంలోని క్వేటా పట్టణంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కదా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ప్రస్తుతం ఆఫ్గన్ దేశం భారతదేశానికి చెందిన గూఢచార నిఘా సంస్థల ఆధీనంలో పని చేస్తోందని, ఈ విషయమై తమ వద్ద సాక్ష్యాధారాలున్నాయని ఆయన తెలిపారు.

ప్రస్తుతం తాను చెప్పేది నిజమని, చాలాసార్లు ఈ విషయమై ప్రస్తావన తీసుకువచ్చానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆఫ్గన్, భారతదేశాలకు చెందిన గూఢచార నిఘావ్యవస్థల సహకారం ఇరు దేశాలకు ఉందని, ఈ విషయం పాక్‌లోని ప్రతి పౌరునికి తెలుసునని ఆయన అన్నారు.

ఇటీవల అమెరికా అగ్రనేతలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఐఎస్ఐ ఎట్టి పరిస్థితుల్లోను ఉగ్రవాదులకు సహాయమందివ్వదని ఆయన స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి