భారత్-పాక్ చర్చల్ని స్వాగతిస్తున్నాం: అమెరికా

దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఇటీవల జరిగిన చర్చలను స్వాగతిస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ పేర్కొంది. ఇరు దేశాలు ఈ శాంతి చర్చలను మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.

'భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన ఇటీవలి చర్చలను స్వాగతిస్తున్నాను, అవి మరింత ముందుకు తీసుకువెళ్తారనుకుంటున్నా' అని అమెరికా త్రివిధ దళాల సిబ్బంది సంయుక్త ఛైర్మన్ అడ్మిరల్ మైక్ ముల్లెన్ ఒక న్యూస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

జులై 27న భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు ఎస్‌ఎం కృష్ణ, హీనా రబ్బానీ ఖర్‌ల మధ్య న్యూ ఢిల్లీలో జరిగిన చర్చలను ముల్లెన్ ప్రస్తావించారు. భారత్, పాక్‌ మంత్రులు తీవ్రవాదంతో పాటు అనేక అంశాలను సృహద్భావ వాతావరణంలో చర్చించారు.

వెబ్దునియా పై చదవండి