భారత్ ప్రజాస్వామిక దేశమే...కాని కాస్త ఎక్కువే: మహాతిర్

ఆసియా దేశాల్లో భారతదేశం ప్రజాస్వామిక దేశమని, కాని ఇది కాస్త ఎక్కువేనని మలేషియా మాజీ ప్రధాని మహాతిర్ ముహమ్మద్ అన్నారు.

ఆసియా అభివృద్ధి అనే ఓ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ... భారతదేశం ప్రజాస్వామిక దేశంగా ఉన్నప్పటికి ఇది కాస్త ఎక్కువగా ఉందని, అయినా కూడా భారత్ అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.

అదే చైనా దేశంతో పోలిస్తే ఈ అభివృద్ధి చాలా తక్కువని, చైనా దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి చాలా మందకొడిగానే సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

భారతదేశంతో పోలిస్తే చైనా, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో ప్రజాశ్వామ్యం కొంత తక్కువగానే ఉందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ఈ దేశాలే ఆసియాకు నాయకత్వం వహిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాల్లోని ప్రజలు ప్రజాస్వామ్యమంటే ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో ఆయా దేశాల్లో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగి వాటి వ్యూహాల కోసమే ఎక్కువ కాలం హరించుకుపోతోందని, దీంతో దేశాన్ని అభివృద్ధి పథం వైపుకు పయనింపజేసేందుకు సమయం చిక్కడం లేదని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి