మధ్యప్రాచ్య దేశాధినేతలకు ఒబామా పిలుపు

వైట్‌హౌస్ సందర్శనానికి రావల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మధ్యప్రాచ్య దేశాలైన ఈజిప్టు, పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాధినేతలను ఆహ్వానించారు. మధ్యప్రాచ్యంలో సమగ్ర శాంతిని నెలకోల్పే దిశగా ఈ ప్రాంత దేశాధినేతలకు ఒబామా ఆహ్వానం పలికారని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ విషయమై వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి రాబర్ట్ గిబ్స్ మాట్లాడుతూ మధ్యప్రాచ్య దేశాధినేతల సందర్శనానికి సంబంధించిన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. జోర్డాన్ రాజు అబ్ధుల్లాతో మంగళవారం జరిగిన సమావేశం విజయవంతమైన నేపథ్యంలో ఒబామా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈజిప్టు, పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాధినేతల అమెరికా సందర్శనానికి సంబంధించిన తేదీలను ఖరారు చేసే విషయాన్ని తాము ప్రస్తుతం పరిశీలిస్తున్నామని గిబ్బ్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి