మలేషియాలో దీపావళి తర్వాత కూడా సెలవే

మలేషియాలో దీపావళి పండుగల తర్వాత మరో రోజు అదనంగా సెలవు ఉంటుంది.

మలేషియా దేశంలో దీపావళి పండుగ సందర్భంగా సెలవులుంటాయి. కాని ప్రత్యేకంగా భారతీయ విద్యాలయాలకు ఒకరోజ అదనంగా సెలవునివ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

అక్కడున్న భారతదేశానికి చెందిన విద్యాసంస్థలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒకరోజు అదనంగా సెలవు కావాలని ఆ దేశపు ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలేషియా ఉపప్రధాని ముహయిద్దీన్ యాసీన్ గురువారం వెల్లడించారు.

ఈ సందర్భంగా భారతదేశానికి చెందిన పలు విద్యాలయాలకు అదనంగా ఒకరోజు సెలవు మంజూరు చేయాలని తమ దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యాశాఖ డైరెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా మలేషియా దేశంలో దాదాపు 20 లక్షలమంది భారతీయులున్నారు. వీరిలో అత్యధికులు హిందువులుండటం గమనార్హం. వీరంతా బ్రిటీష్ పరిపాలనా కాలంలో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డవారే. ఇక్కడ అక్టోబర్ నెల 17న దీపావళి పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.

వెబ్దునియా పై చదవండి