మెక్సికోలో అగ్నిప్రమాదం: 29 మంది దుర్మరణం

వాయువ్య మెక్సికోలోని హెర్మోసిలో నగరంలో ఓ శిశు సంరక్షణా కేంద్రం అగ్నిప్రమాదంలో కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో 29 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మృతులందరూ మూడు నెలల నుంచి రెండేళ్లలోపు వయసువారే. నగరంలోని ఏబీసీ శిశు సంరక్షణా కేంద్రం పక్కనున్న టైర్ల డీలర్‌షిప్‌లో మొదట మంటలు చెలరేగాయి.

అనంతరం అవి ఈ శిశు సంరక్షణా కేంద్రానికి కూడా అంటుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ కేంద్రంలో 120 మంది శిశువులు ఉన్నారు. వీరిలో 50 మందికిపైగా అగ్నిప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 29 మంది శిశువులు మృతి చెందినట్లు గుర్తించారు. వీరందరూ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మెక్సికో రాజధానికి అగ్నిప్రమాదం జరిగిన నగరం 1900 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వెబ్దునియా పై చదవండి