మొట్టమొదటి రాకెట్‌ను ప్రయోగించిన న్యూజిలాండ్!

మంగళవారం, 1 డిశెంబరు 2009 (12:41 IST)
న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఆ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా మంగళవారం మిగిలిపోయింది. రాకెట్ ల్యాబ్ లిమిటెడ్ అనే ప్రైవేటు కంపెనీ తయారు చేసిన రాకెట్‌ను ఆ దేశం తొలిసారి ప్రయోగించింది. ఎటియా-1 అనే పేరుతో రూపొందించిన ఈ రాకెట్‌ను న్యూజిలాండ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.28 నిమిషాలకు నింగిలోకి ప్రయోగించారు. గ్రేట్ మెర్క్యురీ ఐలాండ్ దీవి నుంచి దీన్ని నింగిలోకి పంపారు.

మూడేళ్ళ క్రితం ఏర్పాటైన రాకెట్ ల్యాబ్ మిలిటెడ్ అంతరిక్ష సంబంధిత కార్యక్రమాల్లో నిమగ్నమవడమే కాకుండా రాకెట్లను కూడా తయారు చేసింది. తక్కువ సామర్థ్యం కలిగిన ఏటియా-1 రాకెట్‌ను తయారు చేసి నింగిలోకి పంపి, చరిత్ర సృష్టించింది. ఈ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రాకెట్ ప్రయోగం తొలిదఫాలోనే విజవంతం కావడం గమనార్హం.

రాకెట్ నిర్ధేశిత లక్ష్యాన్ని 50 (31 మైళ్లు) కిలోమీటర్లుగా నిర్ణయంచారు. ఈ లక్ష్యం మరో రెండు రోజుల్లో చేరుకుంటుందని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఈ రాకెట్‌ను ఉదయం 7.10 గంటలకు ప్రయోగించాల్సి ఉండగా, సాంకేతిక లోపం కారణంగా మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

వెబ్దునియా పై చదవండి