యూఎస్ లొంగదీసుకోవాలనుకుంది: కర్జాయ్

ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అమెరికా ప్రభుత్వ యంత్రాంగంపై నిప్పులు చెరిగారు. వ్యతిరేక ప్రకటనలతో తన స్నేహితులు, కుటుంబాన్ని అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడాన్ని హమీద్ కర్జాయ్ తప్పుబట్టారు. తన స్థానాన్ని బలహీనపరిచేందుకు, వారిపై తాను మరింత ఆధారపడేలా చేసేందుకు అమెరికా ఈ ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు.

లె ఫిగరో దినపత్రికకు ఇచ్చిన విస్తృత స్థాయి ఇంటర్వ్యూలో హమీద్ కర్జాయ్ అమెరికా వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గత వారం ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్లు హైజాక్ చేసిన ఇంధన ట్యాంకర్లపై నాటో జరిపిన వైమానిక దాడిని కర్జాయ్ ఖండించారు. గత నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కర్జాయ్ విజయానికి సమీపంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఆయన తాజాగా అమెరికాతో చెడిన సంబంధాలను బయటపెట్టారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొహమ్మద్ ఖాసిం ఫాహింను లక్ష్యంగా చేసుకొని అమెరికా చేస్తున్న విమర్శలు వాస్తవానికి తనను ఉద్దేశించినవని కర్జాయ్ పేర్కొన్నారు.

అమెరికన్లు తనను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటాన్నారంటే, వారిపై తాను మరింత ఆధారపడేలా చేసేందుకేనన్నారు. అయితే ఇది తప్పు. ఆఫ్ఘన్ పౌరులు అమెరికా అధ్యక్షుడిని గౌరవించాలా వద్దా అనేది వారి చేతుల్లోనే ఉంది. అమెరికా చేతుల్లో కీలుబొమ్మగా ఉండే అధ్యక్షుడిని ఆఫ్ఘన్ పౌరులెవరూ కోరుకోవడం లేదని కర్జాయ్ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి