యూఏఈ అధ్యక్షునిగా మళ్ళీ ఎన్నికైన ఖలీఫా

యూఏఐ అధ్యక్షునిగా షేక్ ఖలీఫా బిన్ జయీద్ అల్ నాహ్యాన్ మళ్ళీ రెండవసారి ఎన్నికైనారు.

షేక్ ఖలీఫా బిన్ జయీద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షునిగా తిరిగి రెండవసారి ఎన్నికైనట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించినట్లు డబ్ల్యూఏఎమ్ వార్తా సంస్థ తెలిపింది.

అలాగే గతంలో ఉప రాష్ట్రపతిగా పనిచేసిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్‌ను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇదిలావుండగా యూఏఈ, ఒపెక్ సంస్థకు చెందిన సభ్యులు 2.2 మిలియన్ బ్యారెళ్ళ ముడి చమురును ఉత్పత్తి చేస్తోందని, నేషనల్ ఫెడరల్ కౌన్సిల్ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి