రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దంపతుల విడాకులు!!

File
FILE
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దంపతులు మూడు దశాబ్దాల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు. పుతిన్, ఆయన భార్య ల్యూడ్మిలాలు ఒక అంగీకారానికి వచ్చి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించారు.

విడాకులు తీసుకోవాలన్నది తమ ఇద్దరి సంయుక్త నిర్ణయమని పుతిన్ గురువారం సాయంత్రం బాలే ప్రదర్శనకు వచ్చిన తర్వాత ప్రభుత్వ టెలివిజన్‌లో వెల్లడించారు. పుతిన్ సుదీర్ఘ కాలంగా రష్యా రాజకీయాల్లో ఉన్నా, ఆయన భార్య ల్యూడ్మిలా మాత్రం ఎప్పుడూ ప్రజల్లో కనిపించరు.

వెబ్దునియా పై చదవండి