రసాయన ఆయుధాలు అప్పగింతకు సిరియా సమ్మతం!

మంగళవారం, 10 సెప్టెంబరు 2013 (17:59 IST)
File
FILE
తమ వద్ద ఉన్న రసాయన ఆయుధాలను అప్పగించేందుకు అగ్రరాజ్యం అమెరికాకు సిరియా సమ్మతం తెలిపింది. ఈ విషయంలో సిరియా - అమెరికా దేశాల మధ్య రష్యా జరిపిన దౌత్యం ఫలించింది. దీంతో సిరియాపై సైనిక చర్య చేపట్టే విషయాన్ని పునఃపరిశీలన చేస్తోంది. పైపెచ్చు.. ఆ రసాయన ఆయుధాలను నిర్వీర్యం చేసే బాధ్యతను రష్యాకే అమెరికా అప్పగించింది.

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ఒబామా మాట్లాడుతూ సిరియా రసాయనిక ఆయుధాలపై నియంత్రణను అంతర్జాతీయ అథారిటీకి అప్పగిస్తే సైనిక చర్యను పక్కనపెడతామని చెప్పారు. దీనికితోడు అమెరికా సైనిక చర్యకు దిగకుండా రష్యా తీవ్రంగా అడ్డుపడి, తన దౌత్య నీతిని ప్రదర్శించింది. ఇది ఫలించడంతో సిరియా తన వద్ద ఉన్న ఆయుధాలను అప్పగించేందుకు సమ్మతించింది.

వెబ్దునియా పై చదవండి