లిబియా రెబెల్స్‌ని గుర్తించడాన్ని తప్పుబట్టిన ట్రిపోలీ

లిబియా అధ్యక్షుడు ముయమ్మార్ గడాఫీ అనుకూల ప్రతినిధులను కాదని తిరుగుబాటుదారులను లిబియా చట్టబద్ధ పాలకులుగా బ్రిటన్ గుర్తించడాన్ని రాజధాని ట్రిపోలిలోని గడాఫీ ప్రతినిధులు తప్పుబట్టారు. ఇది బాధ్యతలేని అన్యాయమైన చర్యగా పేర్కొంది.

తిరుగుబాటుదారుల నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్(ఎన్‌టీసీ)ని గుర్తించి ఆహ్వానించినట్లు బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి విలియమ్ హాగ్ బుధవారం వెల్లడించారు. బ్రిటన్ నిర్ణయం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని లిబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఖలీద్ కాయీమ్ విమర్శించారు. బ్రిటన్‌లోని న్యాయస్థానాల్లో పాటు ఇతర అంతర్జాతీయ కోర్టుల్లో లండన్ నిర్ణయంపై గడాఫీ ప్రభుత్వం న్యాయపరంగా పోరాడుతుందని ఖలీద్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి