విదేశీ విద్యార్థుల కోసం బ్రిటన్ వలస నిబంధనల సడలింపు

File
FILE
విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు విదేశాలు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులోభాగంగా బ్రిటన్ విదేశీ విద్యార్థుల కోసం తన వలస విధానాలను సడలించింది. విదేశాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించేందుకు ఈ నిబంధనలను కాస్త సడలించింది.

వలస సంస్కరణల్లో భాగంగా గ్రాడ్యుయేట్ ఎంటర్‌ప్రెన్యూర్ పోగ్రాం పథకానికి చేసిన మార్పులు చేసి అమలుకు తెచ్చింది. ఈ పథకం కింద ఇకపై బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ పూర్తి చేసిన వెయ్యి మంది విదేశీ విద్యార్థులను వారి కోర్సు పూర్తయ్యాక 12 నెలల పాటు బ్రిటన్‌లో ఉండడానికి అనుమతిస్తారు.

అలాగే ప్రస్తుతం పీహెచ్‌డీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు నైపుణ్యం గల ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి, లేదా వ్యాపారం ప్రారంభించడానికి యేడాది పాటు బ్రిటన్‌లో ఉండొచ్చు.

వెబ్దునియా పై చదవండి