శ్రీలంకలో పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పర్యటన

పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ మాసాంతంలో శ్రీలంక పర్యటన చేపట్టనున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత జర్దారీ లంక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. భద్రత, వాణిజ్యం వంటి అంశాలపై ఇరుదేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసేందుకుగాను జర్దారీ శ్రీలంకలో పర్యటించనున్నారని తెలిసింది.

గత ఏడాది సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి, నవంబర్ 19వ తేదీ రెండోసారి అధ్యక్షుడిగా ఎంపికైన రాజపక్సే‌కు శుభాకాంక్షలు తెలియజేసేందుకే జర్దారీ లంక పర్యటన చేపట్టారని పాక్ వార్తా పత్రికలు వెల్లడించాయి.

జర్దారీతో పాటు విదేశాంగ మంత్రి ఖురేషి కూడా శ్రీలంకకు ప్రయాణమవుతున్నారు. వీరిద్దరితో పాటు పాక్ వాణిజ్య బృందం సైతం లంకలో పర్యటించనుంది. అయితే జర్దారీ లంక పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే జర్దారీ లంకలో పర్యటించే తేదీలను ప్రకటిస్తామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి