సంస్కరణల శ్రీకారానికి చైనా మేథో బృందం సిఫార్సు

మంగళవారం, 29 అక్టోబరు 2013 (11:41 IST)
File
FILE
దేశంలో భారీ ఎత్తున సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని చైనా స్టేట్ కౌన్సిల్‌కు చెందిన మేథో బృందం సిఫార్సు చేసింది. భూ సంస్కరణలు, జాతీయ సామాజిక భద్రతా వ్యవస్థ, ప్రభుత్వ యాజమాన్యంలోని పరిశ్రమల్లో మార్పులకు సంబంధించిన సంస్కరణలను ప్రవేశపెట్టాలని ఈ బృందం కోరింది.

వచ్చే నెలలో చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరుగనుంది. దీంతో ఈ బృందం సంస్కరణలకు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేసింది. ఇందులో సంస్కరణలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా.. ఫైనాన్స్‌, పన్నులు, భూమి, ప్రభుత్వ ఆస్తులు, సామాజిక సంక్షేమం, నూతన పరికల్పనలు, విదేశీ పెట్టుబడులు, పరిపాలన వంటి రంగాల్లో సంస్కరణలు చేపట్టాలని కోరింది.

వెబ్దునియా పై చదవండి