సద్దుమణగని వివాదాలు: మంత్రివర్గ విస్తరణలో జాప్యం!

శుక్రవారం, 2 సెప్టెంబరు 2011 (12:30 IST)
నేపాల్ కొత్త మంత్రివర్గం ఏర్పాటులో జాప్యం కొనసాగుతోంది. ఇటీవల కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బాబూరామ్ భట్టారాయ్.. కొత్త మంత్రివర్గ విస్తరణకు శక్తిమేరకు కసరత్తు చేస్తున్నారు. అయితే, సంకీర్ణ పార్టీల మధ్య శాఖల కేటాయింపుల్లో నెలకొన్న మనస్పర్థల కారణంగా ఆయన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేక పోతున్నారు.

దీనిపై మిత్రపక్షమైన మాధేసీ పార్టీ నేత హ్రిదేష్ త్రిపాఠీ స్పందిస్తూ మిత్రపక్షాల మధ్య అనేక విభేదాలు ఉన్నాయి. వీటివల్ల శాఖల కేటాయింపు ఒక తక్షణం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు లేవన్నారు. ప్రధాని మీడియా సలహాదారు మన్రిషీ ధితాల్ స్పందిస్తూ.. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి