సైన్యంలో నియామకాలు చేపట్టనున్న చైనా

శనివారం, 10 ఏప్రియల్ 2010 (09:31 IST)
దేశభద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఈ ఏడాది కొత్తగా 1.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లను నియమించుకునేందుకు చైనా సైన్యం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ సేవలకు శ్రీకారం చుట్టేందుకు ప్రారంభించేందుకు చైనా సైన్యం ప్రయత్నాలు చేస్తోందని స్థానిక వార్తాసంస్థ తెలిపింది.

చైనా తన సైన్యాన్ని సాంకేతికపరంగా మరింత బలోపేతం చేసేందుకు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) ఈ మేరకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ సేవలు ప్రారంభించింది. ఈ ఏడాది డిగ్రీ ముగించిన గ్రాడ్యుయేట్లను సైన్యంలో చేర్చుకునేందుకు విద్యా శాఖతో కలిసి పీఎల్‌ఏ కసరత్తు చేస్తోందని ఆ సంస్థ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి