వైద్యోనారాయణో హరీ అంటారు. అంటే డాక్టర్లు దేవుళ్లతో సమానం అని. అందుకే స్త్రీలు ‘ఆడ – మగా’ ఇలా ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా మోహమాట పడుకుండా ఎక్కడ ఏ సమస్య ఉన్నా అన్నీ చెప్పుకుంటారు. అదే గైనిక్ సమస్యలతో వెళ్లే స్త్రీలు అయితే డాక్టర్లో ఒక అమ్మనో.. ఓ అక్కనో.. ఓ చెల్లినో చూసుకుని అన్నీ చెప్పి శరీరంలోని తమ వ్యక్తిగత భాగాలను చూపించడానికి కూడా ఇబ్బందిపడరు. అయితే అమెరికాలో ఓ డాక్టర్ దీన్నే అదనుగా చేసుకుని ఆడవారి మర్మాయవాలను ఫోటోలు తీసి పైశాచిక ఆనందం పొందేవాడు.
ఎవరీ డాక్టర్
అమెరికాలో బాల్డిమోర్లోని హాప్కిన్స్ ఆసుపత్రిలో పేరొందిన గైనకాలజిస్ట్ లెవీ. పాతికేళ్లు సుధీర్ఘ అనుభవం.. ఆ డాక్టర్ హస్తవాసి చాలా మంచిది. రోగిని టచ్ చేస్తే చాలు ఆరోగ్యవంతుడుగా బయటకొస్తాడనే ప్రచారం ఉంది. ఇక గైనిక్ సమస్యలున్న ఆడవారికైతే ఈయనో ఆపద్భాందవుడు. కానీ ఈ డాక్టరు ఓ పిచ్చి ఉంది. తన దగ్గరకు వచ్చే మహిళా పేషెంట్స్ జననాంగాలను ఫోటోలు, వీడియోలు తీసేవాడు.
దీంతో లెవీపై యాజమాన్యం విచారణ మొదలుపెట్టింది. తన బండారం బయటపడటంతో 2013లో లెవీ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ డాక్టర్ చేసిన అకృత్యాలకు ఇప్పుడు ఆసుపత్రి ‘మూల్యం’ చెల్లించాల్సి వస్తోంది. మొత్తం రు. 1140 కోట్ల పరిహారాన్ని చెల్లించబోతోంది. అమెరికా చరిత్రలో ఓ డాక్టర్ చేసిన నిర్వాకానికి ఆసుపత్రి యాజమాన్యం చెల్లిస్తున్న పరిహారాల్లో ఇదే అతి పెద్దది.