ఈ వివరాలను పరిశీలిస్తే... గ్వాటెమాల నగరానికి సమీపంలోని రియో బ్రావోలో ఓ టాక్సీ డ్రైవర్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో ముఠాలో ఓ 16 యేళ్ళ యువతి కూడా ఉంది. ఈ యువతిని అనుమానించిన మృతుడి బంధువులు, మరికొందరు కలిసి ఆమెను తీవ్రంగా కొట్టారు. రక్తం కారుతున్నా ఏ మాత్రం కనికరం లేకుండా దాడి చేశారు. అంతటితో ఆగని వారు ఆమెను సజీవ దహనం చేశారు.
కాగా, ఈ ఘటన మొత్తాన్ని కొందరు కెమెరాల్లో చిత్రీకరించారు. ఈ దేశంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయని అక్కడి మీడియా వెల్లడించింది. ఎక్కువగా పేద వర్గాల్లోనే చోటు చేసుకుంటాయని తెలిపింది. కాగా, ఆ యువతిని రక్తం వచ్చేలా కొడుతున్న ఆ దుర్మార్గులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురు పోలీసులను కూడా అక్కడి వారు అడ్డుకోవడం విచారకరం.