వచ్చే యేడాది కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయ్!

గురువారం, 26 నవంబరు 2015 (10:42 IST)
ఈ యేడాది నమోదైన ఉష్ణోగ్రతలతో దేశ ప్రజలు తల్లడిల్లి పోయిన విషయంతెల్సిందే. ముఖ్యంగా వేసవి కాలంలో ఉక్కపోతను భరించలేక వందలాది మంది మృత్యువాతపడ్డారు. దీంతో 2015 సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుందని ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ తెలిపింది.
 
2015లో ఉష్ణోగ్రతలు నమోదు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఏడాది సముద్ర ఉపరితలు గరిష్టస్థాయిలో నమోదయ్యాయని ప్రపంచ వాతావరణ సంస్థ అధిపతి మిచెల్ జరాడ్ ఒకప్రకటనలో తెలిపారు. భూగ్రహానికి ఇది దుర్వార్త అని ఆయన వ్యాఖ్యానించారు. 19వ శతాబ్దం మధ్యకాలంతో పోలిస్తే భూమి ఉపరితల ఉష్ణోగ్రత ఒక సెల్సియస్ డిగ్రీ పెరిగిందని తెలిపారు.
 
వాతావరణ మార్పులపై పారిస్‌లో ప్రపంచదేశాల శిఖరాగ్ర సభ మరోవారం రోజులలో జరుగుతుందనగా జరాడ్ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అలాగే, వచ్చే యేడాది (2016) కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో పాటు.. మానవ ప్రేరేపిత భూతమే ఇందుకు కారణమని ప్రపంచ వాతావరణ సంస్థ తేల్చిచెప్పింది.

వెబ్దునియా పై చదవండి