26/11 దర్యాప్తు: కట్టుబడే ఉన్నామన్న పాకిస్థాన్

గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల్లో ప్రమేయం ఉన్న నిందితులను శిక్షించేందుకు పాక్ అధికార యంత్రాంగం కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్దుల్ బసిత్ బీబీసీ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ముంబయి ఉగ్రవాద దాడుల సూత్రధారులను చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.

తమ ఉద్దేశాలపై ఆరోపణలు చేయడాన్ని పక్కనబెట్టి, ఈ ప్రక్రియలో భారత్ తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 26/11 దాడుల దర్యాప్తు విషయంలో భారత్ తమ ప్రభుత్వాన్ని అనుమానిస్తోంది. ఇలా చేయడం సరికాదు. తమ విశ్వసనీయతను శంకించడం మానుకొని, దాడులకు సంబంధించి బలమైన ఆధారాలను భారత్ పంపాలని సూచించారు. బలమైన ఆధారాలుంటే తాము ఈ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లగలమన్నారు.

వెబ్దునియా పై చదవండి