కార్చిచ్చు నుంచి కాపాడిన వ్యక్తిని కౌగిలించుకున్న ఎలుగుబంటి (వీడియో)

శనివారం, 4 జనవరి 2020 (14:19 IST)
ఆస్ట్రేలియా కార్చిచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటిని ఓ వ్యక్తి కాపాడాడు. అయితే ఆ ఎలుగుబంటి తనను కాపాడిన జవానును కౌగిలించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో కొన్ని వారాల క్రితం కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. 
 
అమేజాన్ అడవుల్లో ఈ కార్చిచ్చు కారణంగా వన్య మృగాలు మృతి చెందాయి. ఆస్ట్రేలియాలో మాత్రం కనిపించే అరుదైన కోలా ఎలుగుబంట్లు రెండువేలకు పైగా మరణించాయి. కార్చిచ్చును ఆర్పేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి కార్చిచ్చులో చిక్కిన చిన్న ఎలుగబంటిని కాపాడాడు. అయితే తనను కాపాడిన వ్యక్తిని ఆ చిన్న ఎలుగుబంటి కౌగిలించుకుంది. ఇంకా కాళ్లను గట్టిగా పట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

This bear, rescued from a fire, won't let go of the man who saved him.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు