పెషావర్ షాక్... స్కూళ్లు, కాలేజీలు పది రోజులు మూత

శుక్రవారం, 19 డిశెంబరు 2014 (15:18 IST)
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చిన్నారులను తాలిబన్లు అతి కిరాతకంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాహోర్‌లో జనవరి 3 నుంచి పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. లాహోర్‌లోని పాఠశాలలు, కళాశాలలకు ఉగ్రవాదులు ముప్పు ఉందని ఇంటిలిజెన్స్ నివేదికలు అందడంతో మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 
 
ప్రపంచాన్నే ఉలిక్కిపడేట్టు చేసిన పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఘటనను తలుచుకుని అక్కడి విద్యార్ధులు వణికిపోతున్నారు. ఘటనలో చనిపోయిన చిన్నారుల తల్లిదండ్రులు ఇంకా తేరుకోలేదు. తమ చిన్నారులను గుర్తుకు తెచ్చుకున్ని కన్నీరుమున్నీరు అవుతున్నారు. 
 
విద్యార్థుల మృతికి సంతాపంగా దేశంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు సాగించిన నరమేధంలో మొత్తం 141 మంది చనిపోయారు. ఇందులో 132 మంది విద్యార్థులు కాగా, 9 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి