మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో పేర్కొన్నారు. జైషే మహ్మద్ అనేక ఉగ్ర దాడులకు పాల్పడిందని, ఆ దాడుల వల్ల అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై భారత్‌తో కలిసి పోరాడే విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని స్పష్టం చేసారు. ఐక్యరాజ్యసమితిలో కూడా భారత్‌తు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా ఇప్పటికి 3 సార్లు ప్రతిపాందించగా చైనా ప్రతిసారీ ఈ విషయంలో అడ్డు తగులుతూ వచ్చింది. ఈ విషయంపై స్పందించిన పల్లాడినో శాంతి స్థాపనకు అమెరికా, చైనా కలిసి పని చేస్తాయన్నారు.