విమానం టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్లు.. పైలట్ల అప్రమత్తతతో తప్పిన పెను ముప్పు (Video)

వరుణ్

గురువారం, 11 జులై 2024 (13:07 IST)
అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో పెనుముప్పు తప్పింది. విమానం టేకాఫ్ అవుతుండగా విమానం టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీన్ని గమనించిన పైలెట్లు అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు ఉపయోగించి విమానాన్ని నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 
 
అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్ వే చివర ఆగింది. 
 
ఒక వేళ పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగివుండేది. సంఘటన జరిగిన విమానంలో 176 మంది ప్రాయాణికులు ఉన్నారు. వీరంతా ప్రాణాలతో ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం నుంచి గట్టెక్కించిన పైలెట్లను ప్రయాణికులు అభినందలతో ముంచెత్తారు. 

 

విమానం టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్లు.. పైలట్ల అప్రమత్తతతో బ్రతికిన ప్రయాణికులు

అమెరికా - ఫ్లోరిడా విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతోన్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి.

పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్ వే చివర ఆగింది.. ఒక… pic.twitter.com/Th5FZwo7mq

— Telugu Scribe (@TeluguScribe) July 11, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు