డిన్నర్... ఒబామా ముందు ఖాళీ ప్లేటుతో మోడీ... ఏంటి సంగతి...?

మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:08 IST)
భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఘనమైన విందునిచ్చారు. వైట్ హౌస్ వేదికగా ఈ విందుకు మోడీని ఆహ్వానించారు. అయితే చిత్రంగా నరేంద్ర మోడీ ముందు ఖాళీ ప్లేటు దర్శనమివ్వడంతో చూసిన వారు కాస్త అవాక్కయ్యారు. 
 
నవరాత్రుల సందర్భంగా కఠోర ఉపవాసం ఆచరిస్తున్నాననీ, అందువల్ల తాను విందులో కూర్చున్నప్పటికీ ఆహార పదార్థాలను తినలేనని, మిగతావారు విందును ఆస్వాదించాలని, తాను తినకపోవడాన్ని ఎవరూ అసౌకర్యంగా భావించరాదని వివరణ ఇచ్చుకున్నారు నరేంద్ర మోడీ. ఎంతో రుచికరమైన ఒబామా విందును మోడీ తప్ప అంతా ఆస్వాదించారు. వంటకాలు చాలా బావున్నాయని కితాబిచ్చారు.

వెబ్దునియా పై చదవండి